సింగరేణి జీఎంపై చర్యలు తీసుకోండి
Singareni:మందమర్రి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ACP, మందమర్రి పోలీసు స్టేషను లో ఫిర్యాధు చేశారు. వివరాల్లోకి వెళితే AITUC బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి చాగం మల్లేష్ శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం వెళ్లారు. కార్మికుని సమస్యపై మాట్లాడేందుకు జనరల్ మేనేజర్ దేవేందర్ని కలిశారు. శాంతిఖని పోస్టింగ్ ఇచ్చిన ఉద్యోగినీ అక్కడి నుండి కాసిపేట్1 ఇంక్లైన్ లేదా కాసిపేట్2 ఇంక్లైన్ బదిలీ చేయాలని అడగారు. నాకు ఇదే పనా… నాకు వేరే పని లేదా.. బాయిలు నువ్వే నడుపుకో.. మీ ఇష్టం అయినట్లు చేసుకో.. దానికి నేను చెయ్య నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా.. పిచ్చోడా నీకు బుద్ధి లేదా అని ఇదే పదాన్ని అనేకమార్లు అంటూ నువ్వు బయటికి వెళ్ళు, ఇక్కడి నుండి బయటకు వెళ్లిపో అంటూ తనను అవమానిస్తూ మాట్లాడి కించపరిచారనీ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితుడని, నిమ్న జాతికి చెందిన తక్కువ కులానికి చెందిన వాడినని అవమానపరిచి కించపరిచిన మందమర్రి జనరల్ మేనేజర్ దేవేందర్ పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.