పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా హోలీ సంబరాలు

Ramagundam Police Commissionerate: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. హోలీ పండుగ పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకి రంగులు పూశారు. ఈ సందర్బంగా సీపీ అధికారులు, సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం సంబరాల్లో పాల్గొన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందించారు. ఈ హోలీ వేడుకలు పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లివిరియాలని, హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిప్ బాస్కర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర రావు, గోద్వారిఖని ఎసిపి ఎం.రమేష్, ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్లారెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, సిసి హరీష్ పాల్గొన్నారు.