బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

సూర్యాపేట జిల్లా చిలుకూరులో శ‌నివారం తెల్లవారుజామున బీటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని గంగాధ‌రి కృష్ణవేణి చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల (GATE Engineering College)లో చదువుతోంది.

ఉగాదికి ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం కళాశాలకు వచ్చింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్లోనే గడిపింది. అనంతరం తెల్లవారుజామున తల్లి రూంలో ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళాశాల యాజమాన్యం పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like