ఐఏఎస్ అధికారుల బదిలీ
Transfer of IAS officers: తెలంగాణ(Telangana)లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకటాద్రి, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిని నియమించారు.