దేశాధ్య‌క్షుడు అయితే నాకేంటి..?

Emmanuel Macron:ఓ దేశాధ్య‌క్షుడి భార్య ఆయ‌న చెంప చెళ్లుమ‌నిపించింది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెటి చెంపచెళ్లుమనిపించింది. ఆయన సోమవారం వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో విమానం దిగుతుండగా మాక్రాన్‌ చెంపపై ఆయన భార్య కొట్టారు. స‌రిగ్గా విమానం దిగేందుకు స‌మాయ‌త్తం అవుతున్న స‌మ‌యంలో ఈ దృశ్యం వీడియోకు చిక్కింది. ఇంకేముంది అది మొత్తం వైర‌ల్ అయ్యింది. అయితే, ఈ వ్య‌వ‌హారంపై ఫ్రాన్స్‌ అధ్యక్ష కార్యాలయం స్పందించింది.

అధ్యక్షుడిని ఆయన భార్య కొట్టలేదని, కేవలం టీజ్‌ చేసేందుకు మాత్రమే అలా చేసిందని తెలిపింది. అయితే దీనిపై మాత్రం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధ్యక్షుడిపై అందిరి ముందు అలా చేయిచేసుకోవడం దేశాన్ని అవమానించినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం భార్యగా బ్రిగెటి క్లోజ్‌గా మూవ్‌ అయ్యారని, దీనిలో తప్పేమి లేదని చెబుతున్నారు. దేశాధ్య‌క్షుడు అయినా పెండ్లాం చేతిలో త‌న్నులు తినాల్సిందేనంటూ మీమ్స్ పేలుతున్నాయి.

You might also like