ఆ సభ చారిత్రాత్మకం
Dallas:అమెరికాలోని డల్లాస్(Dallas)లో జరగనున్న బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ చారిత్రాత్మకం కానుందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అన్నారు. జూన్ 1న డల్లాస్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. అందరూ సభ గురించే ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని అది అందరూ నమ్ముతున్నారని తెలిపారు. రాయలసీమ (Dallas Rayalaseema Ogranizations) నుంచి 200 మంది హాజరు అయ్యి సంఘీభావం తెలిపారని, అది ఎంతో సంతోషకరమన్నారు. ఈ సభకి అన్ని సంస్థల నుంచి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్, గాదరి కిషోర్, క్రాంతి కిరణ్ చంటి, బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు