ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంజయ్ జాజు కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, సలహదారు, సీఎం ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమితులైన కె. రామకృష్ణా రావు కూడా ఉన్నారు.

1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం సీఎస్‌గా నియమించింది. ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సంజయ్ జాజు గతంలో ‘మీ సేవ’ రూపకర్తగా పనిచేశారు.

You might also like