సీతక్క మాట…ఎమ్మెల్సీ నిద్ర…

అది ఏకంగా మంత్రి సమీక్షా సమావేశం.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యక్రమం..ఆ సమావేశంలో ఓ ప్రజా ప్రతినిధి గాడ నిద్రలోకి జారుకున్నారు. మరి ఆయన చిన్న ప్రజాప్రతినిధి కాదు.. ఏకంగా ఎమ్మెల్సీ..

మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా వేదికపై ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య గాడనిద్రలోకి జారుకుని గుర్రు కొట్టాడు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఇలా నిద్రలోకి జారుకోవడం ప్రజాప్రతినిధుల అలసత్వానికి నిదర్శనమని పలువురు గుసగుసలాడుకున్నారు. మొత్తానికి మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ గాఢ నిద్రలోకి వెళ్లడంతో అక్కడున్న నాయకులంతా ముక్కున వేలేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like