మిస్ వరల్డ్ 2025 గా ఓపల్ సుచాత
Miss World 2025:మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంశ్రీ నిలిచారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరుని ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా 72వ మిస్ వరల్డ్ ఓపల్ సుచాతకి కిరీటంతో సత్కరించారు.
ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ ఫైనల్స్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్లో కనుల విందుగా సాగింది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీపడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా పోటీ పడ్డారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభ చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈవెంట్ లో తళుక్కుమన్నారు. ఫైనల్స్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు దంపతులు సందడి చేశారు.