ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
MRPS: బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల కోసం కృషి చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘతన ఎమ్మార్పీఎస్‌కు దక్కుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1994 జులై 7న ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ వివిధ జిల్లా మండల గ్రామాలకు విస్తరించి అనేక ఉద్యమాలకు కేంద్రం అయ్యిందని స్పష్టం చేశారు.
సమాజంలో ఉన్న అనేక అసమానవుతున్న రూపుమాపడానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసినట్లు తెలిపారు. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు సమాజంలో మాదిగ జాతికి దక్కిన గౌరవం అని వెల్లడించారు. అణగారిన వర్గాల ప్రజలు, పేదలు, ఆరోగ్యశ్రీ పథకం, వితంతువుల వికలాంగుల పింఛన్ల పెంపుదల ఇలా సమాజంలో అనేక పోరాటం చేసి విజయం సాధించిన ఘనత ఎమ్మార్పీస్ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కుతుందన్నారు. అంటరాని కులంగా సమాజం చూసిన రోజుల్లోనే ఆ కులానికి గౌరవాన్ని తీసుకొచ్చి ఏకంగా దేశ ప్రధాని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే వరకు పోరాటం చేశారని గుర్తు చేశారు. అంటే మాదిగల పోరాటం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐబి చౌరస్తాలోని ఎమ్మార్పీఎస్ జెండా జిల్లా ఇంచార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని కేకు కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ చుంచు శంకర్ వర్మ మాదిగ, పట్టణ కో ఇంచార్జి గొడిశల దశరథం మాదిగ, పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు మోతే పోషం మాదిగ, జిలకర శంకర్ మాదిగ, పట్టణ ప్రధాన కార్యదర్శి గారే చంద్ర శేఖర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ చిప్పకుర్తి సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.