ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె

సింగ‌రేణి వ్యాప్తంగా స‌మ్మె కొన‌సాగుతోంది. కొమురం భీం జిల్లాలో కైరిగూడ ఓపెన్‌కాస్టు ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణితో పాటు వివిధ రంగాల‌కు చెందిన‌ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో విదేశీ పెట్టుబడును వెంటనే ఉపసంహరించుకోవాలని, సింగరేణి సంస్థ వెంటనే లాభాల వాటా ప్రకటించాల‌న్నారు. వాటాలో కార్మికులకు 40 శాతం చెల్లించాల‌న్నారు.

You might also like