మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Ministers visit: జిల్లాలో ఆదివారం(13న) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆబ్కారీ-మద్యనిషేధ, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ ఎ. భాస్కర్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారని, అధికారులు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు.

13న 11.10 గంటలకు లక్షేట్టిపేటలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంట‌లకు అధికారులు, అనధికారులతో సమావేశమై 12.10 గం॥లకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంట‌లకు దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు (పైలెట్ ప్రాజెక్టు) శంఖుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారని వెల్ల‌డించారు. 3.15 గంటలకు హాజీపూర్ మండలం గుడిపేట ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారని, సాయంత్రం 4 గంట‌లకు హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ శంఖుస్థాపన చేసి ప్రజలతో మాట్లాడతారన్నారు. 4.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాత శిశు కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్ల‌డించారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రముఖుల బందోబస్తు ఏర్పాట్లు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల తహసిల్దార్లు బృందంగా పని చేసి వాహనాల పార్కింగ్ స్థలంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like