బెల్లంప‌ల్లి స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా మ‌నోజ్‌

IAS Officer: త‌మ శిక్ష‌ణ పూర్తి చేసిన ప‌లువురు ఐఏఎస్‌ల‌కు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ క్యాడ‌ర్‌కు చెందిన ఆరుగురు ఐఏఎస్‌ల‌ను ఆయా జిల్లాల్లో స‌బ్ క‌లెక్ట‌ర్లుగా నియ‌మించింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజ‌న్ల‌కు ప్రభుత్వం సబ్ కలెక్టర్లను నియమించింది. నిర్మల్ జిల్లా భైంసా, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్లకు ఇప్పటి వరకు ఆర్డీవోలు ఉండగా, ఇక నుంచి ఐఏఎస్ క్యాడర్ అధికారులు వస్తున్నారు. భైంసాకు అజ్మీరా సంకేత్, బెల్లంపల్లికి మనోజ్ రానున్నారు. ఈ ఇద్దరు సబ్ కలెక్టర్లు త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు.

ఉమా హార‌తి (నారాయ‌ణ్‌ఖేడ్‌, సంగారెడ్డి జిల్లా), అజ్మీర సంకేత్ కుమార్ (భైంసా, నిర్మ‌ల్ జిల్లా), అభిగ్యాన్ మాల‌వ్య (ఆరూ్మ‌న్ నిజామాబాద్ జిల్లా), అజ‌య్ యాద‌వ్ (క‌ల్లూరు, ఖ‌మ్మం జిల్లా), మృణాల్ శ్రేష్ట (భ‌ద్రాచ‌లం, భ‌ద్రాది కొత్త‌గూడెం జిల్లా), మ‌నోజ్ (బెల్లంప‌ల్లి, మంచిర్యాల జిల్లా) స‌బ్‌క‌లెక్ట‌ర్లుగా నియ‌మించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like