రేపు సింగ‌రేణిలో సెల‌వు ఇవ్వండి

Singareni: రాఖీ పండ‌గ సంద‌ర్భంగా శ‌నివారం (రేపు) వేతనంతో కూడిన సెల‌వు దినంగా ప్ర‌క‌టించాల‌ని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి కోరారు. వారు శుక్ర‌వారం సింగ‌రేణి సీఎండ్‌డీ ఎన్‌.బ‌ల‌రాం, డైరెక్ట‌ర్ (పా) గౌతంపొట్రూకు విన‌తిప‌త్రం అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గాంధీ జ‌యంతి, ద‌స‌రా పండుగ‌లు ఒకే రోజు రావ‌డం వ‌ల్ల కార్మికులు ఆర్థికంగా న‌ష్ట‌పోతార‌ని అన్నారు. అదే విధంగా కంపెనీ ఉత్ప‌త్తికి సైతం అంత‌రాయం క‌లుగుతుంద‌న్నారు. కోల్ ఇండియా యాజ‌మాన్యం రాఖీ పండగ‌కి వేత‌నంతో కూడిన సెల‌వు దినం ప్ర‌క‌టించిన విష‌యాన్ని వారు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇక్క‌డ కూడా రాఖీ పండ‌గ‌కు సెల‌వు అమ‌లు చేయాల‌ని టీబీజీకేఎస్ కోరుతోంద‌న్నారు. సింగ‌రేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మ‌నోభావాల‌ను అర్థం చేసుకుని స‌త్వ‌ర‌మే సానుకూల నిర్ణ‌యం తీసుకుని సింగ‌రేణి వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like