కవితా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పు

INTUC Janak Prasad:10 ఏండ్లుగా సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కల్వకుంట్ల కవితదని, ఇప్పుడు కళ్ళలో మట్టి కొట్టే కల్లబొల్లి మాటలు చెబుతోందని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ దుయ్యబట్టారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన కవిత, సింగరేణిని దోచి నాశనం చేసిందన్నారు. ఇప్పుడు ఇంట్లో పంచాయతీ పెట్టుకుని HMSతో పొత్తు అంటూ ప్రెస్ మీట్ పెట్టి కల్లబొల్లి మాటలు చెబితే, కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. సంవత్సరానికి 5 కొత్త బొగ్గు గనులు ఓపెన్ చేస్తామన్న మీరు, 10 ఏళ్లలో ఒక్క కొత్త గని కూడా ఎందుకు తెరవలేదన్నారు.. ?

సొంతఇంటి కల, పేర్క్స్, ఇన్కమ్ టాక్స్ రద్దుకు సంబంధించి
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ హామీలు మీరు ఎందుకు నెరవేర్చలేదు.. ఇప్పుడు ఎందుకు గొంతెత్తుతున్నారు..? అని ప్రశ్నించారు. రాజకీయ జోక్యం గురించి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సింగరేణి నిధుల నుండి కార్మికుల 30 వేల కోట్లు దుర్వినియోగం చేసి MLA, మంత్రులకు 2 కోట్ల చొప్పున పంచింది TBGKS, BRS కాదా..? అన్నారు.

ఎన్నికల్లో కార్మికుల తీర్పు ఈ అవినీతి ఫలితమే, కోల్ బెల్ట్‌లో BRS MLAలను చిత్తుగా ఓడించారు. గుర్తులేదా.. ? అని ప్రశ్నించారు. 10 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉన్న TBGKS, చివరి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని స్థితికి చేరింది అంటే అవినీతి ఎంత దారుణమో కార్మికులకు బాగా తెలుసునన్నారు. 10 ఏళ్లలో మీ ప్రభుత్వం ఏమి చేసింది? 22 వేల కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని మీరు చెబుతారు, కానీ అసెంబ్లీలో “ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా లేడు” అని కెసిఆర్ చెప్పిన మాట మర్చిపోయారా..? అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు ₹5,000 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. మొన్నటి దాకా కేసీఆర్, కవితపై తీవ్రంగా విమర్శలు చేసిన HMS నేత కామ్రేడ్ రియాజ్, ఇప్పుడు కవిత కాళ్ల దగ్గర యూనియన్ తాకట్టు పెట్టడం కార్మికుల గౌరవానికి అవమానమన్నారు. కవితకు STPP గురించి మాట్లాడే హక్కే లేదనీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప సీఎం భట్టి విక్రమార్క నాయకత్వం, కార్మికుల కృషి వల్లే సింగరేణి ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి, లాభాలు సాధించిందన్నారు. పర్మినెంట్ కార్మికులకు మాత్రమే కాదు, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల వాటా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.

రూపాయి ఖర్చు లేకుండా పర్మినెంట్ కార్మికులకు ₹1 కోటి ప్రమాద భీమా, కాంట్రాక్ట్ కార్మికులకు ₹40 లక్షల ప్రమాద భీమా కాంగ్రెస్ ఇచ్చిన గౌరవమని స్పష్టం చేశారు. 35–40 ఏళ్ల వయో పరిమితి పెంపు కోసం 10 ఏళ్లు BRS మోసం చేసిందనీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 2 నెలల్లోనే పెంచిందనీ జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like