యూరియా కోసం రైతుల ఆందోళ‌న‌

Farmers’ concern for urea:త‌మ‌కు యూరియా స‌క్ర‌మంగా ప‌ర‌ఫ‌రా చేయ‌డం లేదంటూ మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపూర్లో రైతులు ఆందోళ‌నకు దిగారు. నిల్వ‌లు స‌క్ర‌మంగా ఉన్న‌ప్ప‌టికీ సరిపడే యూరియా సరఫరా చేయడం లేదంటూ జై భీమ్ పరస్పర సహాయక సహకార మార్కెటింగ్ సంఘం ముందు ఆందోళన వ్య‌క్తం చేశారు. డీలర్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటు రైతులను మోసం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక్క లోడు మాత్రమే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, అధికారులు కేవ‌లం ఒక‌రికి ఒక్క బ‌స్తా మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్ప‌డంతో రైతులు మండిప‌డ్డారు. నిన్న‌టి వ‌ర‌కు రెండు బ‌స్తాలు ఇచ్చి ఇప్పుడు ఒక్క బ‌స్తా మాత్ర‌మే ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. యూరియా బ్లాక్ మార్కెట్ త‌ర‌లిస్తున్నార‌ని రైతులు దుయ్య‌బ‌ట్టారు. ఈ వ్య‌వ‌హారంలో మండ‌ల వ్య‌వ‌సాయాధికారి య‌మునా దుర్గ మాట్లాడుతూ ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే తాము రైతుల‌కు ఒక్కో బ‌స్తా ఇచ్చామ‌ని చెప్పామ‌న్నారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

You might also like