మంచిర్యాలను ముంచెత్తిన వ‌ర్షం

Rain that flooded Mancherial:మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని మరొకసారి వరద ముంచెత్తింది. ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు ప‌లు కాలనీలోకి చేరింది. ప‌ట్ట‌ణంలోని సూర్య నగర్, హమాలివాడ, తిలక్ నగర్, బృందావన కాలనీ, సున్నం బట్టి వాడలోని వరద నీరు ఇళ్లలోకి చేర‌డంతో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం అయ్యింది. రోడ్ల‌పైకి నీరు చేర‌డంతో జ‌నం బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న రాళ్ల‌వాగు, తోళ్ల‌వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు చెబుతున్నారు. అవస‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

You might also like