ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
కొమురంభీం జిల్లా కాగజ్నగర్ లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోడు భూముల సమస్య, 49 జిఓ రద్దు కోసం నేడు ఫారెస్ట్ ఆఫీసు ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఉదయం ఆయన ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేసారని ఎమ్మెల్యే పాల్వాయి వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, ఇతర నేతలను అరెస్టు చేసి కెరమెరి పోలీస్స్టేషన్ తరలించారు.