కాంగ్రెస్ వీడి కారెక్కిన భార్గవ్ దేశ్ పాండే

ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ భార్గ‌వ్ దేశ్‌పాండేకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పిన్నవయసులోనే రాష్ట్ర స్థాయిలో యుత్ కాంగ్రెస్ నేతగా క్రియాశీలకంగా ఎదిగి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. భార్గావ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పార్టీకోసం పనిచేసే వారికే ఇవ్వాల‌ని ధిక్కార స్వ‌రం వినిపించారు. దీంతో ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. అప్ప‌టి నుంచి ఆయన అనుచరులు, మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఓత్తిడి తెస్తున్నారు.

ఆయ‌న ప‌ది రోజుల కింద‌ట‌ ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ను క‌లిశారు. కేటీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఈ రోజు కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో సానిహిత్యం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, హనుమంత్ రావు తదితర నేతలతో సైతం మంచి పరిచయాలు ఉండగా పార్టీ నుండి పిలుపు కోసం ఇంతకాలం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ వీడి కారు పార్టీలో చేరారు. భార్గవ్ బీఆర్ఎస్ లో చేరిక ఆ పార్టీ జిల్లాలో మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ చేరిక కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు కోవ ల‌క్ష్మి, అనిల్ జాద‌వ్‌, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామ‌న్న‌, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్‌, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్‌చార్జీ జాన్స‌న్ నాయ‌క్‌, యువ‌జ‌న నాయ‌కులు జోగు మ‌హేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

You might also like