కాంగ్రెస్ నేత ఇంటి పై దాడి

RTA సభ్యుడు అంకతి శ్రీనివాస్ ఇంట్లో టీవీ, కారు ధ్వంసం

లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో అధికార పార్టీకి చెందిన RTA మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు టీవీతో పాటు కారును ధ్వంసం చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో అంకతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like