అంబులెన్స్‌ను ఢీ కొట్టిన లారీ… ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ మృతి

వైద్యం కోసం ఆదిలాబాద్ నుంచి వెళ్తున్న అంబులెన్స్‌ను రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు మృత్యువాత ప‌డ్డారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఝ‌రి గ్రామానికి చెందిన ఓ రోగిని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. కడ్తాల్ వద్ద తమిళనాడు నుండి ఉత్తరాఖండ్ వైపు వెళ్తున్న లారీ రాంగ్ రూట్ లో వచ్చి అంబులెన్స్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఝ‌రి గ్రామానికి చెందిన సరస్వతి, పారుబాయి అక్కడికక్కడే మృత్యువాతప‌డ్డారు. ఈ ఘటనలో మ‌రో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్, గీత అనే మ‌హిళ‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

You might also like