ఇందిరమ్మ ఇళ్లు పథకంపై ఒక్క కాల్‌తో ఫిర్యాదు చేయవచ్చు

Call center on Indiramma Housing Scheme:ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిర‌మ్మ ప‌థ‌కానికి సంబంధించి సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు, ఫిర్యాదులు ఉన్నాయి. మ‌రోవైపు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం, అవకతవకలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.. దీని ద్వారా ఏమైనా స‌మ‌స్య‌లున్నా.. ఎవ‌రి మీదైనా ఫిర్యాదు చేయాల‌నుకుంటే దీనికి కాల్ చేస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పేదవారి సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించి.. దశలవారిగా లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది. ఇప్పటికే తొలి విడత ఇళ్ల నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక దశల వారీగా నిధులు విడుదల చేస్తుండటం.. ఇల్లు నిర్మాణం సమయంలో పలు అంశాలకు సంబంధించి లబ్ధిదారుల్లో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన సమాధానాలు చెప్పే వారు అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు దీనిని ప్రారంభించారు. దీనికి 1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. ఈ కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేస్తే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను తెలుసుకుని.. వాటిని నోట్ చేసుకుని సంబంధిత అధికారులకు పంపిస్తారు.. ఆ స‌మ‌స్య‌ పరిష్కారం అయ్యేలా చూస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. ఈ కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like