భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చం

BJP Telangana:భార‌త‌దేశానికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చ‌మ‌ని ఆదిలాబాద్ ఎంపీ గొడం న‌గేష్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘునాథ్ వెరబెల్లి నియామకం తరువాత మంచిర్యాలకు మొదటిసారి వ‌చ్చిన‌ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం శత్రుదేశం పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టిందన్నారు. ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్ తగ్గించి ముందుకు వెళ్తోంద‌న్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్ ను నియమించడం అభినందనీయ‌మ‌న్నారు. రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజక వర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

కార్య‌క‌ర్త‌ల కృషి వ‌ల్లే..
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు, ఎనిమిది ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింద‌న్నారు. పార్టీకోసం కష్టపడిన వారికి పార్టీగుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తుందని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రం ప్రజలను మోసం చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నద‌ని స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దళారులతో బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు యూరియా విక్రయించి రైతులను దోచుకుంటున్నది స్ప‌ష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంద‌న్నారు.

మంచిర్యాల అవినీతికి అడ్డాగా మారింది..
వెరబెల్లి ర‌ఘునాథ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీకి కంచుకోటగా మారిందని స్ప‌ష్టం చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చ‌రించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ క‌ళాశాల లేద‌ని, దానిని సాధించేందుకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ఐటీ పార్క్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చారని దుయ్య‌బ‌ట్టారు. మంచిర్యాల ప్రాంతం అవినీతికి అడ్డగా మారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమ‌న్నారు. కార్యకర్తల కృషి వల్లనే నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవని… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామ‌న్నారు. బీజేపీ పోరాట ఫలితమే మంచిర్యాలలో వందే భారత రైలుకు హాల్టింగ్ అని దానిని నేనే హాల్టింగ్ చేయించానని స్థానిక ఎంపీ చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్ర ఉపాధ్య‌క్షుడి ఘ‌న స్వాగ‌తం..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్ వెరబెల్లి నియామకం తరువాత మంచిర్యాల జిల్లాకు మొదటి సారి విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెన వద్ద బీజేపీ శ్రేణులతో స్వాగతం ప‌లికారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద BMS నాయకులతో కలిసి సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేశారు. సీసీసీ కార్నర్ వద్ద నుంచి బైక్ ర్యాలీ ద్వారా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మొదటగా హనుమాన్ విగ్రహం వద్ద పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, గోమాసే శ్రీనివాస్, గోనె శ్యామ్ సుందర్ రావు, కొయ్యల ఎమాజీ, ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ధోనీ శ్రీశైలం, పెద్దపల్లి పురుషోత్తం, మున్నారాజా సిసోడియా, గాజుల ముఖేష్ గౌడ్, జోగుల శ్రీదేవి, ముత్తె సత్తయ్య, కమలాకర్ రావు, కోడి రమేష్, పట్టి వెంకట కృష్ణ, అక్కల రమేష్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణ మూర్తి, ఆకుల అశోక్ వర్ధన్, అందుగుల శ్రీనివాస్, పులగం తిరుపతి, వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, ఉదయ శ్రీ, మంత్రి సురేఖ పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like