కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాలి

BMS:సింగ‌రేణిలో కార్మికుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని BMS డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పొన్నమనేని వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. RG3, జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జనరల్ మేనేజర్ కి వినతి పత్రం అందజేసి అనంత‌రం మాట్లాడారు. సింగరేణి సంస్థ ద్వారా, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు, ప్రభావిత గ్రామ పిల్లలకు సీబీఎస్ఈ పాఠ‌శాల ద్వార ఉచిత విద్య అందించాల‌న్నారు. గోదావరిఖనిలో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించాల‌ని డిమాండ్ చేశారు. కొత్తగనులు ఏర్పాటు చేసి కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నారు.

సింగరేణికి రావాల్సిన బకాయిలు 42,000 కోట్ల రూపాయలను చెల్లించాలని వేణుగోపాల్ రావు డిమాండ్ చేశారు. 2024-25 అర్థిక సంవత్సరం లాభం నుండి 40% బోనస్ చెల్లించాల‌న్నారు. కోల్ఇండియాలో అమ‌లు చేస్తున్న‌ట్లు భ్య‌తంపై ఆదాయపన్ను సింగరేణిలో అమలు చేయాల‌న్నారు. సమావేశంలో ఆర్జి త్రీ ఉపాధ్యక్షులు అరుకాలప్రసాద్, బ్రాంచ్ కార్యదర్శి రౌతు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గోగుల విద్యాసాగర్, పిట్ సెక్రటరి రాజమహేందర్ రెడ్డి, పాక కృష్ణ, జానీ, వెంకటేష్‌, రమేష్ పాల్గొన్నారు.

You might also like