ఎద్దుపొవ‌డంతో వ్య‌క్తి మృతి

Man dies after being gored by bull:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రవీంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎద్దు పోవ‌డంతో వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే.. రాజారాం అనే వ్య‌క్తి ఓ పంచాయతీకి వెళ్తుండ‌గా, ఓ ఎద్దు ముకుతాడు అల్లుకుని ఇబ్బందులు ప‌డుతోంది. దీనిని గ‌మ‌నించిన ఆయ‌న ఎద్దుకు ముకుతాడు సరిచేస్తుండగా ఎద్దు కొమ్ముతో పొడవ‌టంతో ఛాతీలో గుచ్చుకుంది. అలాగే ఎత్తి ప‌క్క‌నే ఉన్న విద్యుత్ స్తంభానికి గుద్ద‌డంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అత‌న్ని బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్య పొందుతూ రాజారం అక్క‌డే మృత్యువాత ప‌డ్డాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like