16 మంది పీఏసీఎస్ చైర్మన్ల తొలగింపు
Removal of 16 PACS chairmen:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 పీఏసీఎస్ చైర్మన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు, మంచిర్యాల జిల్లాలో 11 మందిని తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఒకేసారి ఇంత మందిని తొలగించడం సంచలనం కలిగిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు పీఏసీఎస్ చైర్మన్లు.. కుమారి, ముఖ్రా, నర్సాపూర్, జాబిడి, మాన్కాపూర్, మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, కోటపల్లి, భీమిని, జెండా వెంకటాపూర్, నెల్కి వెంకటాపూర్, పడ్తన్ పల్లి, గూడెం, ఇటిక్యాల్, జైపూర్, నెన్నెల, మందమర్రి చైర్మన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు పది అంశాల్లో విచారణ నిర్వహించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని చోట్ల యూరియా, వ్యవసాయ పరికరాలు పంపిణీలో అక్రమాలు పాల్పడ్డట్టు అధికారులు విచారణలో తేలింది. ఇలా పది రకాల లోపాలను గుర్తించిన అధికారులు నివేదిక పంపడంతో వేటు వేశారు. ఆయా సంఘాలను పర్సన్ ఇన్‌చార్జీలను సైతం నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.