మధుయాష్కీకి అస్వస్థత

madhu yashki Goud:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయానికి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.విషయం తెలుసుకున్న మధుయాష్కి అనుచరులు, సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు భారీగా AIG ఆస్పత్రి(aig-hospital)కి తరలివస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like