వారు పోడు రైతులు కాదు… అట‌వీ ఆక్ర‌మ‌ణ దారులు..

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని లోతొర్రె బీట్‌లోని కంపార్ట్‌మెంట్ నం.280లో అక్రమ ఆక్రమణలు చేస్తున్న 26 మంది నిందితులను అట‌వీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారు చెట్లను నరికివేస్తూ, గుడిసెలు వేసుకుంటున్నార‌ని వారు వెల్ల‌డించారు. వీరికి పదే పదే కౌన్సెలింగ్ చేసినప్పటికీ, నిందితులు అటవీ నేరాలను కొనసాగిస్తున్నార‌ని అన్నారు. శుక్ర‌వారం వీరిని లక్సెట్టిపేట్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్ విధించారు. వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు.

ఈ సంద‌ర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అక్రమ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అరెస్టైనవారు అక్రమ ఆక్రమణదారులే కానీ “పోడు రైతులు” కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. అరెస్టు చేసిన నిందితులు వీరే.. పర్చాకి మారు, కనక బాపురావు, తొడసం హన్మంత రావు, ఆత్రమ్ అక్బర్ షో, ఆత్రం రాజు, విద్మ జైవంత్ రావు, సిడం యత్మా రావు, కనక మంకు, ఆత్రం భీంరావు, సోయం చత్రుగం, ఆత్రం భీంరావు, సిడం మోతీరాం, ఆత్రం సీతు, పారుబాకి మారుతి, మడావి భీంరావు, మెస్రం రాజేశ్వర్, కుమ్ర పాండు, మడావి సోమోజీ, తొడసం సీతారాం, కనక చంద్రబాను, సోయం రవీందర్, పెండోర్ జలపతి, మంగం భరత్, షేర్మాకి సంతోష్, కనక యశ్వంత్ రావు, పెండోర్ జుగాది రావు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like