ఎమ్మెల్యే జన్మదినం.. బాధితులకు ఆర్థిక సహాయం
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు బాధితులకు ఆర్థిక సాయం అందించారు. దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన లింగాల దివ్య(సింధు) మల్లేష్ కూతురు శాన్వి ఐదేండ్లుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు తలసేమియాతో బాధ పడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారి ఇబ్బందులు గమనించిన మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానులు అందరూ కలిసి మొత్తం 53,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ప్రేంసాగర్ రావు జన్మదినం సందర్బంగా బాధితులకు ఆర్థిక సాయం చేసిన వారిని పలువురు అభినందిస్తున్నారు.