నల్ల బ్యాడ్జిలతో సింగరేణి కార్మికుల నిరసన
Singareni:లాభాల వాట విషయంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులను మోసం చేసిందనీ TBGKS నేతలు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. అర్జీ 2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో TBGKS నేతలు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లు చూపించి, అందులో నుండి రూ.4,034 కోట్లు అభివృద్ది పేరిట పక్కన బెట్టడం దారుణమన్నారు. కేవలం రూ.2,360 కోట్లలను లాభాలుగా చూపించడం కార్మికులను వంచించడమే అన్నారు. 34 శాతం ఇస్తామన్నారు కానీ అసలు ఇచ్చేది మాత్రం 12.8 శాతమే అని స్పష్టం చేశారు. మోసపురితమైన ఈ వాటా ప్రకటనను TBGkS వ్యతిరేకిస్తోందని అన్నారు .