వ‌ర్షంలో త‌డుస్తూ..

యూరియా కోసం రైతులు వర్షంలో తడుస్తూ.. చలికి వణుకుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ఎరువుల‌ కోసం సొసైటీల ఎదుట రాత్ర‌న‌క‌గా, ప‌గ‌ల‌న‌కా పడిగాపులు ప‌డుతున్నారు. ఒక్క యూరియా బ‌స్తా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన రైతులు, మ‌ధ్య‌లో వ‌ర్షాలు లేక అల్లాడిపోయాడు. ఇప్పుడు వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్న‌రు. యూరియా కోసం వానలో తడుస్తూ లైన్లు కట్టే పరిస్థితి ఎదురైంది.

మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లిలో రైతులు వ‌ర్షంలో సైతం క్యూ లైన్ల‌లో నిల‌బ‌డ్డారు. ఉద‌యం మూడు గంట‌ల నుంచి రైతులు యూరియా కోసం వేచి చూస్తుండ‌గా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర్షం ప‌డుతున్న‌ప్ప‌టికీ ఆ వ‌ర్షంలోనే రైతులు నిల‌బ‌డి యూరియా కోసం వేచి చూస్తున్నారు.

You might also like