71 మంది మావోయిస్టుల లొంగుబాట
Mavoist party:మావోయిస్టు పార్టీకి దెబ్బ దెబ్బ మీద తాకుతోంది. ఓ వైపు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టు పార్టీ క్యాడర్ లొంగిపోతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) బుధవారం దంతెవాడ జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ ఎదుట ఏకంగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 30 మందిపై రూ. 64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజి సుందర్‌రాజ్ తెలిపారు.
లొంగిపోయిన మావోలు గతంలో అనేక విధ్వంసక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఐజి పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పోలీసు అధికారులు స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ఉపాధి అవకాశఆలు కల్పిస్తామన్నారు.