భారత్ లక్ష్యం 147
india vs pakistan asia cup final:ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా హార్దిక్ తప్పుకోగా, రింకూ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఎదుట 147 పరుగుల లక్ష్యం ఉంచింది. మొదట పాకిస్తాన్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. పాక్ ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. దీంతో ఒక దశలో పాక్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది.
కానీ, భారత స్పిన్నర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. భారత బౌలర్లలో కులదీప్ నాలుగు, వరుణ్, బూమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. కులదీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఆయన వేసిన 17వ ఓవర్‌లో ఫహీమ్ అశ్రఫ్ తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్ సల్మాన్ అఘా, షహీన్ అఫ్రిదీలను కులదీప్ అవుట్ చేశాడు.