బతుకమ్మ ఆడి వచ్చేలోపు…
బతుకమ్మ కోసం వెళ్లి ఆడి వచ్చే లోపే ఇంట్లో దొంగలు పడ్డారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం ఓల్డ్ కాలనీ క్వాటర్ నెంబర్ D-111లో సింగాని లక్ష్మయ్య దంపతులు ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బతకమ్మ ఆడడానికి వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటిపై కప్పు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రెండున్నర తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లారు దొంగలు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.