మాదారంలో కొండచిలువ కలకలం
Madaram:తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లో కొండచిలువ కలకలం సృష్టించింది. జనావాసాల్లోకి రావడంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. రాజీవ్ నగర్ ప్రాంతంలో రాత్రి కొండ చిలువ కనిపించింది. దీంతో కొందరు యువకులు దానిని చంపేశారు. తరచూ అడవిపందులు, పాములు, కొండ చిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.