భారత్ ఘన విజయం
Ind Beats WI in Ahmedabad Test:అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. ఇన్నింగ్స్,140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 448/5 వద్ద తన స్కోర్ డిక్లేర్డ్ చేసింది. ఫలితంగా 286 పరుగుల లక్ష్యంతో మూడో రోజును ప్రారంభించిన వెస్టిండీస్ ఆదిలోనే ఘోరంగా తడబడింది. నేడు లంచ్ సమయానికి ముందే ఐదు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లంచ్ తరువాత కూడా అదే తడబాటుకు లోనైన ప్రత్యర్థి జట్టు టీ బ్రేక్ వరకూ కూడా కొనసాగ లేక చతికిలపడిపోయింది. వెస్టిండీస్ బ్యాటర్‌లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేయగలిగారు. అలిక్ అథనేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 25 పరుగులు చేశారు. క్యాంపెబెల్ 14 పరుగుల చేసి వెనుదిరిగాడు.
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 146 ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలోKL రాహుల్, ధృవ్, జడేజా సెంచరీలతో రాణించారు. రాహుల్ 100, ధృవ్ 125, జడేజా 104(నాటౌట్) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, జడేజా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌కు 4,బుమ్రాకు 3 వికెట్లు పడ్డాయి. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3 వికెట్లు తీయగా, జడేజా 4 వికెట్లు పడగొట్టాడు.