చెక్‌పోస్టు వద్ద నగదు పట్టివేత

ఎన్నికల తనిఖీలలో భాగంగా కోటపల్లి మండలం పారుపల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర సిరంచ తాలూకా రేగుంట గ్రామానికి చెందిన గడపల్లి సాయి (23) అనే యువకుడు నాగపూర్‌ నుండి స్వగ్రామానికి వెళ్తుండగా అతని వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అతడి MH 33 AC 3555 నంబరు గల స్కార్పియో వాహనంలో ₹1,90,000 నగదు లభ్యమైంది.

ఆ మొత్తానికి సంబంధించి ఎటువంటి రసీదులు, ఆధారాలు చూపించలేకపోవడంతో, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎస్‌ఐ రాజేందర్ ఆధ్వర్యంలో నగదు సీజ్ చేశారు. తనిఖీలో గిర్దావార్ శ్రీనివాస్ తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like