బీసీ సంఘాల ఆందోళన
BC unions’ concerns:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు(High court) స్టే విధించిన సంగతి తెలిసిందే. జీవో అమలు నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమకు అన్యాయం జరిగిందంటూ బీసీ నేతలు నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’, ‘బీసీ వ్యతిరేకుల్లారా ఖబడ్దార్’ అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఆరోపించారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నారని.. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు మొత్తం అగ్రవర్ణాలకే. కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులైనా బీసీలకు దక్కొద్దా..? అని బీసీ నేతలు నిలదీశారు.