న్యాయం జ‌ర‌గాలి.. శ‌వం క‌ద‌లాలి..

త‌న అన్నయేట మధూకర్ చావుకు కార‌ణ‌మైన వ్య‌క్తులపై చ‌ర్య‌లు తీసుకునేంత వ‌ర‌కు శ‌వాన్ని క‌ద‌లనిచ్చేది లేదంటూ ఆయ‌న త‌మ్ముడు శ‌వానికి అడ్డంగా ప‌డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల నిర్వాకం వ‌ల్ల తాను ఆత్మహ‌త్య చేసుకుంటున్న‌ట్లు వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు యేట మధూకర్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డ విష‌యం తెలిసిందే. అయితే, నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అప్పుడే శ‌వాన్ని త‌ర‌లించాలంటూ మ‌ధూక‌ర్ బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. ఉద‌యం నుంచి శ‌వాన్ని చెట్టుపైనే ఉంచారు. అయితే, బెల్లంప‌ల్లి ఏసీపీ న‌చ్చ‌జెప్ప‌డంతో శ‌వాన్ని కిందకు దించినా అక్క‌డి నుంచి త‌ర‌లించే ప్ర‌స‌క్తే లేదంటూ భీష్మించుకున్నారు.

ఎస్ఐపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే…
నీల్వాయి ఎస్ఐ కోటేశ్వ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యేట మధూకర్ బంధువులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు చెప్ప‌గానే మ‌ధూక‌ర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టార‌ని అందుకే ఎస్ఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చిన బెల్లంప‌ల్లి ఏసీపీతో వారు మాట్లాడుతూ ఎస్ఐపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఆయ‌న‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే శ‌వాన్ని క‌ద‌లనివ్వ‌మ‌ని భీష్మించుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like