వ్యాపార‌స్తుల‌ను క‌లిసి.. శుభాకాంక్ష‌లు తెలిపి..

మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు విజిత్ రావు సోమ‌వారం మంచిర్యాల ప‌ట్ట‌ణంలో వ్యాపార‌స్తుల‌ను క‌లిశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా వ్యాపార‌స్తులు, ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారికి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. పట్టణంలోని ప్రతి షాపు వద్దకు వెళ్లి వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మంచిర్యాల కార్పొరేషన్ నాయకులు, TBGKS నాయకులు,కార్యకర్తలు, బీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

You might also like