న‌గ్నంగా ఫొటోలు తీసుకుని… బ్లాక్‌మెయిల్…

అమ్మాయి కనిపిస్తే చాలు వ‌ల వేస్తున్నారు… పదేపదే వెంటపడి వేధిస్తున్నారు… అమ్మాయిల‌ను వ‌ల‌లో వేసుకోవ‌డం… వారి న‌గ్నంగా ఫొటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయ‌డం వారికి ప‌రిపాటిగా మారింది… కాలేజీ విద్యార్థినులు, హాస్ట‌ళ్ల ఉండి చ‌దుకునే వారు, ఉద్యోగాలు చేసుకునే మ‌హిళ‌లే వీరి టార్గెట్‌.. ఓ ఇద్ద‌రు యువ‌కులు ఇలా ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది… మహిళలను ట్రాప్ చేసి నగ్న ఫోటోలు తీసుకుని, అమ్మాయిలను వేధిస్తున్న ఇమ్రాన్, సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు .

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంద‌రు పోకిరీలు ప‌లువురు మ‌హిళ‌లు, యువ‌త‌ల‌ను ట్రాప్ చేస్తూ వారితో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ప్రేమ పేరుతో వారిని లొంగ‌దీసుకుని, ఆ త‌ర్వాత సెల్‌ఫోన్ల‌తో న‌గ్నంగా వీడియోలు, ఫొటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డుతున్నారు. పెండ్లి చేసుకుంటామ‌ని మ‌రికొంత మందితో స్నేహం పెంచుకుని లైంగికంగా లొంగ‌దీసుకుంటున్నారు. మావ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని షేక్ స‌ల్మాన్‌, ఇమ్రాన్‌ఖాన్ అనే ఇద్ద‌రు నిందితులు క‌లిసి ఓ యువ‌తిని పుట్టిన రోజు పేరుతో సెల్ఫీలు తీసుకుని, లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మొద‌ట సల్మాన్ ప్రేమ పేరుతో ప్ర‌స్తావ‌న తీసుకురాగా, ఆమె నిరాక‌రించింది. దీంతో బ్లాక్‌మెయిల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. వేధింపులు ఎక్కువ కావ‌డంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌ల న‌గ్న‌ఫొటోలు..
పోలీసులు ఆ నిందితుల‌ను అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ప‌దుల సంఖ్య‌లో మహిళల నగ్న ఫోటోలు ల‌భించ‌డంతో పోలీసులు షాక్ కు గురైన‌ట్లు స‌మాచారం. ఈ ఇద్దరు వ్యక్తులు కొంత కాలంగా మ‌హిళ‌లు, యువ‌తుల‌ను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారని సెల్ ఫోన్ లో చిక్కిన ఆధారాలను బట్టి వెల్లడవుతోంది. అయితే అవి ఎక్కడివారివి ఎలా తీసారు అనేదానిపై న విచారణ చేపట్టామ‌ని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, త‌ల్లిదండ్రులు సైతం పిల్ల‌లు ఏం చేస్తున్నారు..? ఫ‌ఓ ఫోన్ల‌లో ఎవ‌రితో మాట్లాడుతున్నారు గ‌మ‌నించాల‌ని డీఎస్పీ జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like