రైతుల ఆందోళ‌న‌.. ఎస్ఐ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌..

Farmers’ concerns.. SI’s abusive behavior: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) లో ప‌త్తి కొనుగోళ్ల విష‌యంలో రైతులకు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. జిల్లాలోని వాంకిడిమండల కేంద్రంలో GVP జిన్నింగ్ మిల్ వద్ద గురువారం ప‌త్తి కొనుగోళ్లు చేప‌ట్టారు. అయితే, మొద‌టి రోజే కొర్రీల పేరిట రైతులు నానా ఇబ్బందులు ప‌డ్డారు. పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంద‌ని సీసీఐ (CCI) అధికారులు పత్తి కొనుగోలు ఆపేశారు.. మొదట రెండు బండ్లలో పత్తి 12 శాతం కన్నా తక్కువ తేమ ఉండడంతో సీసీఐ కొనుగోలు చేసింది. ఆ తర్వాత బండ్లలో పత్తి తేమ శాతం 15 నుంచి 20 శాతం వరకు రావడంతో సీసీఐ అధికారులు కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో రైతులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 20శాతం తేమ ఉన్న కూడా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

ఎస్ఐ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌..
అయితే, ర‌హ‌దారిపై రాస్తారోకో చేస్తున్న రైతుల‌పై వాంకిడి ఎస్ఐ మహేందర్ ప్ర‌వ‌ర్తించిన తీరుప‌ట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మొద‌ట కొద్దిసేపు ఎస్ఐ రైతుల‌కు న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అధికారులు అంద‌రూ రావాలి… క‌లెక్ట‌ర్ రావాలంటూ ర‌వి అనే రైతులు గొడ‌వ చేశాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన ఎస్ఐ స్టేషన్ తీసుకెళ్తా ఫాల్తు నా కొడకా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. దమ్ముంటే స్టేషన్ కు తీసుకెళ్ళు అంటూ రైతు గొడవకు దిగాడు. ఎస్ఐ న‌న్ను లం… కొడ‌కా అని తిట్టాడంటూ రైతు ఆరోపించారు. త‌న‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like