సింగ‌రేణి ఉద్యోగుల వారుసుల‌కు కారుణ్య నియామ‌కాలు

Singareni: సింగరేణి కార్మిక కుటుంబాలకు INTUC శుభవార్త చెప్పింది. ఈ నెల 12న కారుణ్య అభ్య‌ర్థుల‌కు ఈ నెల నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. సింగరేణిలో మెడిక‌ల్ అన్‌ఫిట్ అయి.. వారి పిల్ల‌లు మెడిక‌ల్ పూర్త‌యినా వారికి నియామ‌క ప‌త్రాలు అందించ‌లేదు. దీంతో వారు ఎన్నో నెల‌లుగా సింగ‌రేణి గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ పరిపాలనా కారణాలతో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ నియామక పత్రాల జారీ కోసం వారు ఎన్నోమార్లు సంస్థ‌కు మొర పెట్టుకున్నారు. అయినా వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

ఈ నేప‌థ్యంలోనే ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ (INTUC Secretary General Janak Prasad) దీనిపై దృష్టి సారించారు. ఆయ‌న కృషి ఫలితంగా సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది కారుణ్య అభ్యర్థులకు ఈ నెల 12న నియామక పత్రాలు అందజేయ‌నున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Deputy Chief Minister of the state Bhatti Vikramarka Mallu) చేతుల మీదుగా నిర్వ‌హించనున్న‌ట్లు INTUC నేత‌లు స్ప‌ష్టం చేశారు. INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నిరంతరం యాజమాన్యం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న‌ట్లు నేత‌లు తెలిపారు. INTUC నేతృత్వంలోని ఈ విజయం కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు మరోసారి నిరూపిస్తోందని యూనియ‌న్ స్ప‌ష్టం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like