యావత్ భారతాన్ని ఏకం చేసిన “వందేమాతరం”
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య
యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం “వందేమాతరం” అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. స్వాతంత్ర సమరంలో భారతీయులందరినీ ఏకం చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.