సౌదీ అరేబియాలో హజ్ యాత్రికుల మృతి… అంతా హైదరాబాదీలే..
Fatal bus accident in Saudi Arabia:సౌదీ అరేబియా(Saudi Arabia)లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు దగ్దం అయ్యింది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు. సజీవదహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బదర్ మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 1.30 గంటలు సమయంలో ఈ ఘోర ప్రమాదం జరగ్గా.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉమ్రా ఏజెన్సీకి చెందిన అధికారుల సమాచారం ప్రకారం… భారతీయ యాత్రికులతో నిండిన బస్సు ఐదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సులో 42 మంది మృతి చెందారు. ఈ బస్సులో హైదరాబాద్ కు చెందిన బృందం ఉన్నట్లు చెబుతున్నారు.. ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికులను బస్సు తీసుకెళ్తుంది. మదీనా నుంచి 160 కి.మీ దూరంలో ఉన్న ముహ్రాస్ అనే ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది.
సివిల్ డిఫెన్స్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీని కారణంగా, మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం, భారతీయ ఏజెన్సీలు, ఉమ్రా ఏజెన్సీలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయి.