పోలీస్ వాహ‌నంతో రీల్స్‌…

Viral Video:రీల్స్ మోజులో నానా అరాచకాలు చేస్తున్నారు… ఒకడు రన్నింగ్ ట్రైన్ తో పరుగెడతాడు. ఇంకోడు పట్టాలపై రైలుకు అడ్డంగా పడుకుంటాడు. పామును మెడలో వేసుకుంటాడొకడు. అదే పాముకు ముద్దు కూడా పెడతాడు. ఇంట్లో, బస్సులో, స్కూళ్లో, పార్కులో, హాస్పిటల్లో.. అంతెందుకు స్మశానంలో శవంతో కూడా రీల్స్ చేస్తుంటారు. రీల్స్, షార్ట్స్ యావ ఈమధ్య మరీ ఎక్కువైంది. లైక్స్ కోసం, షేర్ల కోసం, కామెంట్స్ కోసం.. పడి చచ్చిపోతున్నారు. లైక్స్ వస్తే ఒక బాధ.. రాకపోతే ఇంకో బాధ. వ్యూస్ పెరిగితే అలాంటివే మరిన్ని పిచ్చి పనులు చేసేందుకు వెంపర్లాడుతున్నారు. వ్యూస్ రాకపోతే.. అది కాకుండా మరో వెరైటీ పని కోసం ట్రై చేస్తున్నారు. ఇలా ఒకసారి ఆ మైకంలో మునిగితే.. ఇక అందులోంచి బయటకు రావడం చాలా కష్టంగా మారింది..

తాజాగా ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నంతోనే రీల్స్ చేశారు ఇద్దరు యువకులు. ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఇన్నోవా వాహనంలో రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు యువకులు. ఒకడు వాహ‌నంలో నుంచి దిగి డోర్ తీసి.. నేనేరా పోలీస్ అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. ఎంచక్కా వీడియోలు తీసుకుని.. వాటిని మంచిగా ఎడిటింగ్ చేసి.. ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇంకేం.. వెంటనే వైరల్ అయింది ఆ వీడియో. అధికారిక వాహనంలో రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాహనం ఎవ‌రు ఇచ్చారు..? రీల్స్‌కు అనుమతి ఎవరిచ్చారని పోలీస్ వర్గాల్లో చర్చ మొదలైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like