తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

తెలంగాణ‌లో ప‌లువురు ఐపీఎస్‌ల బ‌దిలీలు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వీసీ సజ్జనార్‌ను ఫైర్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ డీజీపీగా నియమించగా… ఆయ‌న స్థానంలో హైదరాబాద్‌ సీపీ బాధ్యతలను మహేశ్ ఎం భగవత్‌కు అప్పగించింది.

చారు సిన్హా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీపీగా నియామ‌కం కాగా, త‌న‌కు అదనంగా సీఐడీ డీజీగా బాధ్యతలు ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా డీజీపీగా బదిలీ చేశారు. అదేవిధంగా ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వాతి లక్రాను జైళ్ల శాఖ డీజీపీగా నియమించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీ అనిల్ కుమార్‌ను.. టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) ఎండీగా బదిలీ చేశారు. పౌరసరఫరాల కమిషనర్‌గా వై. నాగిరెడ్డిని నియమించారు.

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా అకున్ సబర్వాల్ .. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర నియామకం జరిగింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి.. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్, ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీ జి. చందన దీప్తికి జోగులాంబ జోన్-7 డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కార్తికేయను మల్టీ జోన్-1 ఐజీగా నియమించి, ఐసీసీసీ డైరెక్టర్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కె. రమేష్ నాయుడును రైల్వే ఐజీగా నియమించారు. డి. జోయల్ డేవిస్‌ను రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు. జి. చందన దీప్తికి జోగులాంబ జోన్-7 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఆర్. భాస్కరన్‌కు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కె. నారాయణ నాయక్‌కు బాసర జోన్-2 డీఐజీ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఎల్.ఎస్. చౌహాన్‌ను డీఐజీ (కోఆర్డినేషన్)గా నియమించి, చార్మినార్ జోన్-6 డీఐజీ బాధ్యతలు కూడా అప్పగించారు. శ్రీ బాలాదేవిని TG-TMARS డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించారు. వి. అరవింద బాబును హైదరాబాద్ సిటీ డీసీపీ (SM&IT)గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1654లో మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలను వెల్లడించింది.

You might also like