పోలీసు వాహ‌నంలో రీల్స్‌.. ఇద్ద‌రి అరెస్టు

Reels in police vehicle.. two arrested:పోలీసు వాహనంలో అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించిన ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసిన‌ట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. నిందితుల్లో ఒక‌రు మైన‌ర్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వారిని అరెస్టు చేయ‌డ‌మే కాకుండా, విధులలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసు సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. నిందితుల్లో ఒక‌రు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన షేక్ ఫయాజ్, ఆదిలాబాద్‌కు చెందిన ఒక మైన‌ర్ ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరోడ్రం వద్ద డ్రింకింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పెట్రోలింగ్ వాహనం ముందుకు వెళ్లే పరిస్థితిలో, ఇద్దరు యువకులు ఆగి ఉన్న పోలీసు వాహనంలో వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన‌ట్లు సీఐ వివ‌రించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరిపై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 714 /2025 u/sec 329(4),292 BNS ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామ‌న్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like