బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత్ అణ్వస్త్ర సామర్థ్యం గల జలాంతర్గామి ప్రయోగ బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో INS అరిహంత్ నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణి నుంచి ప్రయోగించారు. ఈ పరీక్షను చాలా రహస్యంగా ఉంచారు. క్షిపణి పరీక్షలకు ముందు సాధారణంగా జారీ చేసే నోటీసు టు ఎయిర్‌మెన్ (NOTAM)ను సైతం భారతదేశం రద్దు చేసింది. చైనా నిఘా నౌకలు ఈ ప్రాంతంలో ఉన్నందున నోటామ్ రద్దు చేశారని చెబుతున్నారు. ఈ క్షిపణి పరీక్ష భారతదేశం సముద్ర ఆధారిత అణ్వస్త్ర నిరోధక శక్తి బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిపుణులు చెబుతున్నారు. K-4 క్షిపణి భారత్ లో స్వదేశంగా అభివృద్ధి చేశారు. దీనిని DRDO ప్రత్యేకంగా అణు జలాంతర్గాములలో ఉపయోగించడానికి రూపొందించింది.
K-4 క్షిపణి యొక్క ప్రధాన లక్షణాలు:
పరిధి: దాదాపు 3,500 కి.మీ (కొన్ని నివేదికలు పేలోడ్ బట్టి 4,000 కి.మీ వరకు అని చెబుతున్నాయి)
పొడవు: దాదాపు 12 మీటర్లు
వ్యాసం: దాదాపు 1.3 మీటర్లు
బరువు: 17 మరియు 20 టన్నుల మధ్య
పేలోడ్: అణు వార్‌హెడ్‌తో సహా 2 టన్నుల వరకు
చోదకం: రెండు-దశల ఘన-ఇంధన రాకెట్
ప్రయోగ పద్ధతి: నీటి అడుగున కోల్డ్ లాంచ్ సిస్టమ్
అధునాతన లక్షణాలు: 3Dసామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోవడానికి రూపొందించారు.
ఈ K-4 క్షిపణులతో, భారతదేశం తన జలాంతర్గాములను శత్రు తీరాలకు సురక్షితంగా దూరంగా ఉంచుతూ సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగలదు.
అరిహంత్-క్లాస్ జలాంతర్గాములపై మోహరింపు
ప్రతి అరిహంత్-క్లాస్ జలాంతర్గామి నాలుగు K-4 క్షిపణులను మోహరించగలదు. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న అణు జలాంతర్గాములు ఒక్కొక్కటి ఎనిమిది K-4 క్షిపణులను మోసుకెళ్లగలవని భావిస్తున్నారు. ఇది భారత్ సముద్ర దాడి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. నవంబర్ 2024లో INS అరిఘాట్ నుండి K-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.