స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌కు స‌న్మానం

కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌ను CPM తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స‌న్మానించారు. తాండూర్ మండలం నర్సాపూర్ సర్పంచ్ గా గెలుపొందిన మడావి పర్పత్ రావు, వార్డు అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆత్రం గౌరుకు శాలువలతో సత్కరించారు. ఈ సంద‌ర్భంగా CPM పార్టీ తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ నర్సాపూర్ గ్రామపంచాయతీ మారుమూల‌న ఉంద‌ని, ఆయా తండాల‌కు రోడ్డు మార్గం స‌క్ర‌మంగా లేద‌న్నారు. వీరికి రవాణా సౌకర్యం కల్పించాల‌ని డిమాండ్ చేశారు. తండాలకు విద్యుత్ సౌక‌ర్యం కూడా నామ‌మాత్రంగానే ఉంద‌న్నారు. కరెంటు సౌకర్యం క‌ల్పించాల‌న్నారు. వీరి సమస్యలు పరిష్కరించడంలో నూతనంగా ఎన్నికైన మడవి పర్ప‌త్‌రావు, ఎన్నికైన కొత్త పాల‌క మండ‌లి వేగవంతంగా పనిచేయాలని సీపీఎం పార్టీ కోరుతోంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో బొల్లం రాజేశం,గుడిమేత బాపురావు, సోయం ప్రభాకర్, కోట్నాక శ్యామ్ రావు, ఆత్రం గంగు, ఆత్రం అనిల్, సోయం గంగు నాయకులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like